తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు: ఎన్నారైల హంగామా

June 04, 2016
img

కేవలం హైదరాబాద్ లో, తెలంగాణా రాష్ట్రం లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ దినోత్సవాలు జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా డల్లాస్ లాంటి ప్రదేశాల్లో ఎన్నారైలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నారు.

రాష్ట్ర సాధనలో భాగమైన ఒక సంస్థగా టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం) కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం విశేషాలు, ఔన్నత్యాలు, ఎప్పటికప్పుడు విదేశాల్లో ప్రచారం చేస్తూ, రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్ళే జనాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఐతే  ఈ ఫారం, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, మూడు రోజులు (జూన్ 3, 4,5), జరుపుకుంటూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రచారం చేస్తుంది.

ఆ మాటకొస్తే, టీడీఎఫ్ మాత్రమే కాదు, ఇతర స్వచ్చంధ సంస్థలు, ఎన్నారైలు కూడా ఆవిర్భావ  దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. వేల కిలోమీటర్ల దూరానా ఉంటూ కూడా మూలాలను మరచిపోకుండా రాష్ట్రానికి సంబంధించిన వేడుకలలో ఎన్నారైలు పాల్గొనడం అభినందనీయం.

Related Post