తర్వాత ఆ మూడు దేశాల భరతం పడతాం: ట్రంప్‌

January 04, 2026
img

అమెరికా సైన్యం వెనిజులా రాజధాని కాకరస్‌పై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడుని ఆయన సతీమణిని బందీగా అమెరికా పట్టుకు వచ్చిన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌ మరో మూడు దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. పొరుగునే ఉన్నా మెక్సికో, క్యూబా, కొలంబియా మూడు దేశాల నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు అమెరికాలోకి సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. 

మాదక ద్రవ్యాల ముఠాలకు ఆశ్రయం కల్పించి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ఈ మూడు దేశాలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని లేకుంటే తర్వాత మూడు దేశాల భరతం పడతామని ట్రంప్‌ హెచ్చరించారు. 

అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడుని ఆయన సతీమణిని బందీగా పట్టుకువెళ్ళడంపై ఆ మూడు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ట్రంప్‌ హెచ్చరికతో మరింత అప్రమత్తమయ్యి సైన్యాన్ని సర్వసన్నదంగా ఉంచుకున్నాయి. 

అమెరికా దుందుడుకు చర్యని చైనా, రష్యా మరికొన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా సెనేట్ సభ్యుడు రో ఖన్నా కూడా తప్పు పడుతూ ట్వీట్ చేశారు. అమెరికాని చూసి తైవాన్ అధ్యక్షుడుని చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుడుని రష్యా బందిస్తే డోనాల్డ్ ట్రంప్‌ ఏం చేస్తారని ప్రశ్నించారు. 

అయితే ట్రంప్‌ చేతిలో తీవ్ర అవమానానికి గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్క్రీ మాత్రం ఆయన నిర్ణయాన్ని సమర్ధించడం విశేషం. ‘నియంతలను ఏవిధంగా ఎదుర్కోవాలో అమెరికా చేసి చూపింది. ఉక్రెయిన్‌పై నాలుగేళ్ళుగా దాడులు చేయిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా ట్రంప్‌ ఈవిధంగానే హ్యాండిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.          


Related Post