ఇదేమి పిచ్చో...

October 25, 2017
img

భారత్ లో క్రికెట్ అంటే ఒక మతం. అంత ఆధరణ ఉంది కనుకనే వాళ్ళు మనవాళ్ళా..బయటివాళ్ళా అని చూడకుండా కోట్లు పోసి ఆ క్రికెట్ దేవుళ్ళను ఫ్రాంచయిజీలు కొనుకొంటాయి. ఈ మతంలో క్రికెటర్లే  దేవుళ్ళు..అభిమానులే భక్తులు..క్రికెట్ గ్రౌండే ఒక దేవాలయం. దేవుళ్ళే అమ్ముడుపోతున్నప్పుడు, దేవాలయం అమ్ముకొంటే మాత్రం తప్పేమిటి...అనుకొన్నాడు ఒక క్యూరేటర్ మహానుభావుడు. అందుకే బుకీలమని వచ్చిన న్యూస్ రిపోర్టర్ల మాటలు నమ్మి పూణే పిచ్ వివరాలు అమ్ముకోవడానికి సిద్దపడ్డాడు.

ఈరోజు భారత్-న్యూజిలాండ్ రెండో వండే మ్యాచ్ కోసం పూణే స్టేడియంలోని పిచ్ ను సిద్దం చేసిన క్యూరేటర్ పాండురంగ సాల్గావ్ కర్, డబ్బుకు ఆశపడి పిచ్ కు సంబంధించి పూర్తి వివరాలు విలేఖర్లకు అందించారు. మ్యాచ్ కు ముందు మైదానంలోకి ఇతరులు ఎవరూ అడుగుపెట్టడానికి వీలులేనప్పటికీ విలేఖరులను బుకీలని భావిస్తూ అయన స్వయంగా పిచ్ అంతా తిప్పి చూపించి వారు అడిగిన వివరాలన్నీ చెప్పారు.

తరువాత వారు మీడియా ప్రతినిధులని తెలిసి షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న బిసిసిఐ పాండురంగ సాల్గావ్ కర్ ను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో న్యూట్రల్ క్యూరేటర్ ను పంపించి పిచ్ ను పరిశీలింపజేసింది. అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మ్యాచ్ ప్రారంభించడానికి అనుమతించింది.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, బుకీలు, బెట్టింగ్ వంటివి విన్నాము కానీ పిచ్ వివరాలను కూడా అమ్ముకోవచ్చని మొదటిసారి తెలిసింది.

కొద్దిసేపటి క్రితం మొదలైన భారత్-న్యూజిలాండ్ వండేలో న్యూజిలాండ్ టాస్ గెలుచుకొని బ్యాటింగ్ కొరుకొంది. ఇంతవరకు 120 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. మొదటి వండేలో సెంచరీ చేసిన టాల్ లాధమ్(38)ను అక్షర పటేల్ అవుట్ చేశాడు. 

Related Post