భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అప్డేట్

January 17, 2021
img

ఆస్ట్రేలియాలో బ్రిస్ బెయిన్ లోని గబ్బర్ స్టేడియంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడవరోజు 62 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.

 భోజన విరామం అనంతరం భారత్ 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యారు.

 అయితే భారత జట్టులో కొత్తగా వచ్చిన వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ రికార్డు భాగస్వామ్యంతో భారత జట్టును ఆదుకున్నారు.

వాషింగ్టన్ సుందర్ 60 పరుగులతో, శార్దూల్ ఠాకూర్ 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

 భారత్ బ్యాటింగ్ లో శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 62 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు.

 ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ ఐదు వికెట్లు,ప్యాట్ కమ్మిన్స్, మిచల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడ్డాయి.

 టి సమయం అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ వార్నర్ 20 పరుగులతో, మార్కస్ హరీస్ ఒక్క పరుగులతో ఉన్నారు.

 ఆస్ట్రేలియా 54 పరుగులు లో ఉన్నది.

Related Post