రెండో టెస్టులో తడబడిన ఆస్ట్రేలియా

December 26, 2020
img

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోఉన్న భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. భారత బౌలర్ల ధాటికి 195 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించారు. ఆస్ట్రేలియా వికెట్లు కూల్చడంలో బూమ్రా, అశ్విన్, సిరాజ్ ముఖ్య పాత్ర వహించారు. బూమ్రాకు నాలుగు వికెట్లు, అశ్విన్‌కు మూడు వికెట్లు, సిరాజ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా జట్టులో లబూస్ 48 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నారు. 

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లుగా మయూక్  అగర్వాల్,  శుభమాన్ గిల్ వచ్చారు. మయూక్ ఒక్క పరుగు కూడా చేయకుండానే స్టార్క్ వేసిన బంతితో ఎల్బీడబ్ల్యూ అయ్యి వెనుదిరిగాడు. ప్రస్తుతం మొదటి ఆట ముగిసేవరకు భారత్ 36 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. క్రీజులో శుభమాన్ గిల్ 28 పరుగులతో, పూజారా 7 పరుగులతో ఉన్నారు.


Related Post