హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ ఎన్నిక

September 27, 2019
img

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి సుప్రీంకోర్టు జరిగిన ఎన్నికలలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యారు. హెచ్‌సీఏ ఎన్నికలలో మొత్తం 223 సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగా, మహమ్మద్ అజహరుద్దీన్‌కు 147, ఆయనతో పోటీపడిన ప్రకాష్ జైన్‌కు 73, దిలీప్ కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో మహ్మద్ అజహరుద్దీన్ రెండవ ప్రయత్నంలో 74 ఓట్లు మెజార్టీతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి కేటీఆర్‌ మద్దతు కూడగట్టినట్లు సమాచారం. కనుక మహమ్మద్ అజహరుద్దీన్‌ తెరాసలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Related Post