క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్

July 15, 2019
img

క్రికెట్ పుట్టిన దేశమే అయినా 45 ఏళ్లుగా ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ విజేతగా నిలవలేదు. ఐదు సార్లు ఫైనల్ దాకా వెళ్లి వెను తిరిగారు. 2019 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. న్యూజిల్యాండ్ తో జరిగిన ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఉత్కంఠతగా సాగిన ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్ ఫైనల్ మ్యాచ్ లో ట్విస్టులు గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే కాదు చూస్తున్న అభిమానులు కూడా ఊహించని విధంగా జరిగాయి.

లార్డ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు గాను 241 పరుగులు చేసింది. న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్ హెన్రీ నికోల్స్ 55, విలియం సన్ 30, టామ్ లథం 47 పరుగులు చేశారు. 242 పరుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జానీ బరి స్టో 37 పరులు చేశాడు. టాప్ ఆర్డర్ విఫలమవడంతో మిడిల్ ఆర్డర్ లో దిగిన బెన్ స్టోక్స్ మీద భారం పడ్డది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న స్టోక్స్ మరో ఆటగాడు బట్లర్ తో కలిసి ఇంగ్లాండ్ కు స్కోర్ వచ్చేలా చేశాడు. స్టోక్స్ 84, బట్లర్ 59 పరుగులు చేశారు. అయితే చివరి ఓవర్ వరకు టఫ్ ఫైట్ జరుగగా ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లకు 241 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.   

ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ డ్రా అయ్యింది లేదు. అయితే ఇక ఫలితాన్ని నిర్ణయించేది సూపర్ ఓవరే అని డిసైడ్ చేశారు. ఇంగ్లాడ్ సెకండ్ ఇన్నింగ్స్ చేసింది కాబట్టి మొదట సూపర్ ఓవర్ బ్యాటింగ్ కు దిగింది. సూపర్ ఓవర్ లో 15 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఇక ఫైనల్ గా ఒక్క ఓవర్ 16 పరుగుల సూపర్ ఓవర్ లక్ష్యంతో దిగిన న్యూజిల్యాండ్ మళ్లీ సూపర్ ఓవర్ లో కూడా 1 వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది. అయితే సూపర్ ఓవర్ కూడా ఈక్వల్ అయితే ఇన్నింగ్స్ లో ఏ జట్టు ఎక్కువ బౌండరీస్ కొడుతుందో ఆ జట్టు విజయం సాధించినట్టు అవుతుంది. ఈ లెక్క ప్రకారం న్యూజిల్యాండ్ 16 బౌండరీస్ (ఫోర్లు, సిక్సులు) కొట్టగా ఇంగ్లాండ్ 24 బౌండరీస్ కొట్టడంతో విజేతగా నిలిచింది.  

ఇయాన్ మోర్గాన్ సార్ధ్యంలో ఇంగ్లాండ్ మొదటిసారి ప్రపంచ కప్ అందుకుంది. ఈ వరల్డ్ కప్ ఆతిధ్య జట్టే వరల్డ్ కప్ అందుకోవడం విశేషం. ఇన్నాళ్ల ఇంగ్లాడ్ కల నెరవేరింది.   

Related Post