సెమీస్‌లో తడబడుతున్న కోహ్లీ సేన

July 10, 2019
img

ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో ఇప్పటివరకు దూసుకుపోతున్న కోహ్లీ సేన అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తడబడుతో వరుసగా వికెట్లు సమర్పించుకోవడం చూసి క్రికెట్ అభిమానులలో గుబులు మొదలైంది. వర్షం కారణంగా నిన్న భారత్‌-న్యూజిలాండ్ మ్యాచ్ నిలిచిపోయింది. కానీ ఇవాళ్ళ వర్షం పడకపోవడంతో ‘రిజర్వ్-డే’ నిబందనల ప్రకారం మళ్ళీ న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. భారత్‌ బౌలర్లు యధాప్రకారం మళ్ళీ చెలరేగిపోయి 23 బంతులలో 28 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకొన్నారు. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 239 పరుగులు చేయడంతో భారత్‌ 240 పరుగుల లక్ష్యంతో బరిలో దిగింది.

నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీవంటి మేటి బ్యాట్స్ మ్యాన్స్  ఉన్న భారత్‌ టీంకు అదేమీ పెద్ద లక్ష్యం కాదు. కానీ ఆట మొదలవగానే నాలుగు పరుగులకే రోహిత్ ఔటైపోయాడు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. వారిద్దరి తరువాత కెఎల్ రాహుల్ ఔటైపోయాడు. కేవలం 5 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తిరుగేలేదనుకున్న భారత్‌ టీం ఇంత అనిశ్చితంగా ఆడుతుండటంతో క్రికెట్ అభిమానులలో ఆందోళన, ఆగ్రహం మొదలైంది.

ప్రస్తుతం పంత్ 12(18), దినేష్ కార్తీక్ 6(22) తో ఆడుతున్నారు. వారైనా నిలకడగా ఆడుతారో లేదో చూడాలి.

Related Post