త్వరలో ధోనీ కూడా రిటైర్మెంట్!

July 04, 2019
img

ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనందుకు అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ప్రపంచకప్ సిరీస్ తరువాత రిటైర్ అవ్వాలనుకొంటున్నట్లు బీసీసీఐకి ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ధోనీ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కనుక ఈ ప్రపంచకప్ పోటీలలోనే ధోనీ చివరిసారిగా బ్యాట్ పట్టుకొంటున్నట్లు భావించవచ్చు. ధోనీ వీరాభిమానులకు దీనిని జీర్ణించుకోవడం కష్టమే. ధోనీకి వయసు పెరిగినందున ఇదివరకులా చురుకుగా ఆడలేకపోతుండటంతో విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది. ప్రపంచకప్ పోటీలలో కీలకమైన సమయాలలో ధోనీ సరిగ్గా ఆడలేకపోవడంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కనుక ప్రపంచకప్ పోటీలలో భారత్‌ గెలిచినా, ఓడినా ధోనీ తప్పుకోవడం ఖాయమేనాని తెలుస్తోంది. టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే ధోనీ నిష్క్రమణకు గొప్ప ముగింపు లభించినట్లవుతుంది. లేకుంటే హుందాగా తప్పుకొన్నట్లవుతుంది. అంతే!               


Related Post