అంబటి రాయుడు సంచలన నిర్ణయం

July 03, 2019
img

ప్రపంచకప్ పోటీలలో తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన అంబటి రాయుడు, బుదవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఏ క్రికెట్ క్రీడాకారుడికైనా జీవితంలో ఒక్కసారైనా ప్రపంచకప్ పోటీలలో ఆడాలని కోరుకోవడం సహజం. అంబటికి జట్టులో స్థానం లభించనప్పటికీ స్టాండ్ బై ఆటగాడిగా ప్రపంచకప్ జాబితాలో పేరుంది. కనుక ప్రపంచకప్ పోటీలలో నుంచి శిఖర్ ధావన్, విజయ్ శంకర్‌లు నిష్క్రమించినప్పుడు, వారి స్థానంలో తనకు తప్పక అవకాశం కల్పిస్తారని అంబటి చాలా ఆశగా ఎదురుచూశాడు. కానీ శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్, విజయ్ శంకర్ స్థానంలో మాయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పించడంతో అంబటి తీవ్ర నిరాశచెందాడు. 

స్టాండ్ బైగా ఉన్న తనను పక్కను పెట్టి ఇతరులకు అవకాశం కల్పించడాన్ని అంబటి జీర్ణించుకోలేకపోయాడు. ఇక తనకు ఎన్నటికీ ప్రపంచకప్ సిరీస్‌లో ఆడే అవకాశం లభించదని భావించిన అంబటి తీవ్ర ఆవేదనతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఐపిఎల్‌తో సహా అన్ని ఫార్మాట్స్ నుంచి కూడా తప్పుకోవాలనుకొంటున్నట్లు రాయుడు తెలిపాడు.

హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు మొత్తం 55 వన్డేలు ఆడాడు. సగటున 47.05 స్కోరుతో మొత్తం 1694 పరుగులు చేశారు. వాటిలో మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్ పోటీలలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసేందుకు తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను వదులుకున్నాడు. కానీ ప్రపంచకప్ పోటీలలో ఆడాలనే కోరిక నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశానిస్పృహలతో రిటైర్మెమెంట్ ప్రకటించాడు.

Related Post