యువరాజ్ సింగ్ క్రికెట్‌కు గుడ్ బై!

June 10, 2019
img

క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేడు. సోమవారం ఉదయం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను క్రికెట్‌ కెరీర్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌కు గుడ్ బై ఇదే తగిన సమయమని భావిస్తున్నానని చెప్పారు. తన 17 ఏళ్ళ క్రికెట్ కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటి నుంచే అనేక పాఠాలు నేర్చుకొన్నానని అన్నారు. అవి తన జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడ్డాయని యువరాజ్ అన్నారు. ఎంతో ప్రియమైన క్రికెట్‌కు దూరం కాబోతున్నందున యువరాజ్ భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

గాయాల కారణంగా ఇదివరకులాగ చురుకుగా ఆడలేకపోతుండటంతో జట్టులో క్రమంగా స్థానం కోల్పోసాగాడు. అదేసమయంలో టీమిండియాలోకి యువ ఆటగాళ్ళు ప్రవేశించి తమ సత్తా చాటుతుండటంతో యువరాజ్ ఇంకా వెనుకబడిపోయాడు. కనుక ఇంకా జట్టులో కొనసాగేందుకు తాపత్రయపడుతూ మిగిలినవారితో పోటీపడలేక అవమానపడేబదులు గౌరవంగా తప్పుకోవడమే మంచిదని భావిస్తూ ఇవాళ్ళ తన రిటైర్మెంట్ ప్రకటించేడు. 2011లో భారత్‌ వరల్డ్ కప్ సాధించడంలో యువరాజ్ చాలా కీలకపాత్ర పోషించారు. అతను చివరిసారిగా 2012లో టెస్ట్ మ్యాచ్, 2017లో టి20 వన్డేలలో ఆడాడు.

Related Post