నిరుద్యోగ క్రీడాకారులకు శుభవార్త!

May 15, 2018
img

తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగ క్రీడాకారులకు ఒక శుభవార్త! ఇక నుంచి ఉద్యోగ నియామకాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లు 29 రకాల క్రీడాకారులకు, మరో 90 రకాల క్రీడలలో పాల్గొన్నవారికి, పతకాలు సాధించినవారికి వర్తిస్తాయని ఉత్తర్వులలో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తివివరాల కోసం రాష్ట్ర క్రీడాశాఖ వెబ్ సైట్ లో లభిస్తాయి.  


Related Post