ఇవంకా పర్యటనలో ఆకస్మిక మార్పు

November 29, 2017
img

ఇవంకా ట్రంప్ ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తరువాత చార్మినార్ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె మధ్యాహ్నం 3 గంటలకు గోల్కొండ కోటను సందర్శించి తిరిగి వచ్చేశారు. ఆమె ఆ విందులో పాల్గొనకుండా నేరుగా దుబాయ్ వెళ్ళిపోతున్నట్లు అందరూ భావిస్తున్నందున, ఎవరూ ఆమె అక్కడికి వస్తారని ఊహించలేదు.

ఈరోజు రాత్రి సదస్సులో పాల్గొన్నవారికి గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు కార్యక్రమం ఉన్నందున ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కనుక అవి విందుకు వస్తున్న అతిధుల కోసమే తప్ప ఇవంకా కోసమని ఎవరూ అనుకోలేదు. ఎవరూ ఊహించని విధంగా మధ్యాహ్నం 3గంటలకు ఇవంకా ట్రంప్ 17 కార్ల కాన్వాయ్ లో కట్టుదిట్టమైన భద్రత మద్య గోల్కొండ కోటను సందర్శించి మళ్ళీ తను బస చేసిన ట్రైడెంట్ హోటల్ కు వెళ్ళిపోయారు. కనుక ఆమె ఇక ఛార్మినార్ వెళ్ళరని స్పష్టం అయ్యింది. ఆమె ఈరోజు రాత్రి 9.20 గంటలకు  రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానంలో దుబాయ్ వెళతారు. 

Related Post