లిబియాలో ప్లేన్ హైజాక్!

December 23, 2016
img

లిబియా దేశానికి చెందిన ఒక ప్రయాణికుల విమానం శుక్రవారం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.10 గంటలకి సెబా విమానాశ్రయం నుంచి ట్రిపోలీకి బయలుదేరిన కొద్ది సేపటికే హైజాక్ గురయ్యింది. లిబియ దేశానికి చెందిన అఫ్రికియా అనే విమాన సంస్థకు చెందిన ఆ విమానంలో 111 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది కలిపి మొత్తం 118 మంది ఉన్నారు. ఆ విమానం ఒకరు లేదా ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు సమాచారం. తాము మాజీ దేశాధ్యక్షుడు గడాఫీ అనుకూలవర్గానికి చెందిన వారమని చెప్పుకొన్నట్లు తెలుస్తోంది. హైజాకర్లు ఆ విమానాన్ని లిబియాలోనే మాల్టా అనే ప్రాంతానికి మళ్ళించి అక్కడ ల్యాండింగ్ చేయించారు. తమ డిమాండ్లు అన్నీ నెరవేర్చేందుకు లిబియ ప్రభుత్వం అంగీకరించినట్లయితే, ప్రయాణికులందరినీ విడిచిపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని, కానీ కమెండో ఆపరేషన్ నిర్వహించాలని ప్రయత్నిస్తే తమ వద్ద ఉన్న గ్రెనేడ్స్ తో ప్రయాణికులతో సహా విమానాన్ని పేల్చి వేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా లిబియా ప్రభుత్వాదికారులకి హైజాకర్లకి మద్య చర్చలు కొనసాగుతున్నాయి. 


Related Post