చైనాకు జేబు సంస్థగా ప్రపంచ ఆరోగ్య సంస్థ: అమెరికా ఆరోపణ

May 01, 2020
img

ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా మళ్ళీ నిప్పులు చెరిగింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పంపియో మీడియాతో మాట్లాడుతూ, “ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ఏటా 500 మిలియన్ డాలర్లు ఇస్తుండగా చైనా కేవలం 38 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తోంది. కానీ ఆ సంస్థ చైనాకు పబ్లిక్ రిలేషన్స్ విభాగంలాగ పనిచేస్తోంది. అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలి. వుహాన్‌లో కరోనా పుట్టిన తరువాతే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టేడ్రోస్ అధనోమ్ చైనాలో పర్యటించారు. కనుక ఆయనకు కరోనా తీవ్రత గురించి బాగా తెలిసే ఉండాలి. కానీ ఆయన సకాలంలో ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకపోవడం వలన ఇంత మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికంతటికీ కారణమైన చైనాను గట్టిగా నిలదీసి అడిగే సాహసం చేయలేకపోతున్నారు. కరోనా గురించి ముందుగా హెచ్చరించలేకపోయినా, కనీసం కరోనా వ్యాపించిన తరువాతైనా దానిని సమర్ధంగా ఎదుర్కొలేకపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈవిధంగా విఫలమవడం ఇదే మొదటిసారికాదు. దానిని సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఆ పని అమెరికా తప్పకుండా చేస్తుంది,” అని అన్నారు. 


Related Post