అమెరికాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి: ట్రంప్

April 14, 2020
img

చైనాతో వాణిజ్యయుద్ధాలు చేసిన అమెరికా ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో భీకర యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో ఇప్పటివరకు 5,87,337 మంది క్షతగాత్రులయ్యారు. 26,649 మంది బలయ్యారు. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వం, ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కొని పోరాడుతున్నారు. వారి సమిష్టి పోరాటాల కారణంగా అమెరికాలో ఈ వారం కరోనా ఉదృతి కొంత తగ్గింది. ఇప్పటివరకు ప్రతీరోజు కనీసం 30,000 కొత్త కేసులు నమోదు అవుతుండేవి. ప్రతీరోజు కనీసం 2,000 మంది చనిపోతుండేవారు. కానీ ఈరోజు 24,895 కేసులు మాత్రమే నమోదు కాగా 1,334 మంది మరణించారు. కరోనా ఉదృతి తగ్గుతుందనే దానికి ఇది తొలి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. కరోనా వైరస్‌పై తాము చేస్తున్న తీవ్రస్థాయి పోరాటాలు ఫలిస్తున్నాయని, మరికొన్ని రోజులలలోనే దేశంలో కరోనా పూర్తిగా కట్టడి చేయగలమని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రపంచదేశాలలో కరోనాకు భారీ మూల్యం చెల్లించుకొంటున్నవాటిలో అమెరికా తరువాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్  దేశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు వివిద దేశాలలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది.  

ఇటలీ-1,59,513 కేసులు, 20,465 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 

స్పెయిన్- 1,70,099 కేసులు, 17,756 మృతులు 

ఫ్రాన్స్-98,076 కేసులు, 14,967 మృతులు 

బ్రిటన్-88, 621 కేసులు, 11,329 మృతులు 

ఇరాన్‌- 73,303 కేసులు 4,585 మృతులు 

టర్కీ-61,049 కేసులు, 1,296 మృతులు 

బెల్జియం-30,589 కేసులు, 3,907 మృతులు    

కెనడా-25,680 కేసులు, 780 మృతులు 

రష్యా-21, 102 కేసులు, 170 మృతులు

భారత్-10,363 కేసులు, 339 మృతులు 

పాకిస్తాన్-5,716 కేసులు, 96 మృతులు  

Related Post