భారత్‌పై ఇరాన్‌ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం

March 06, 2020
img

డిల్లీలో జరిగిన అల్లర్లపై ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమెనీ చాలా తీవ్రంగా స్పందించారు. భారత్‌లో ముస్లింల ఊచకోతను చూసి ప్రపంచంలో ముస్లింలందరి హృదయాలు ద్రవించిపోతున్నాయి. భారత్‌ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను అడ్డుకొని తక్షణం ఈ నరమేధం ఆపాలి. ప్రపంచంలోని ముస్లింల నుంచి భారత్‌ను వేరు చేసేందుకు చేపడుతున్న ఇటువంటి చర్యలను భారత్‌ ప్రభుత్వం అడ్డుకోవాలి,” అని ఖమెనీ ట్వీట్ చేశారు.     

 

ఇరాన్‌లో విదేశాంగమంత్రి జావేద్ జారీఫ్ కూడా డిల్లీ అల్లర్లను ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. “భారత్‌-ఇరాన్‌ దేశాలమద్య దశాబ్ధాలుగా బలమైన స్నేహ సంబందాలున్నాయి. భారత్‌లో ముస్లింల ఊచకోతను ఇరాన్‌లో ఖండిస్తోంది. మళ్ళీ ఇటువంటి అల్లర్లు చెలరేగకుండా భారత్‌ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. భారత్‌లో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. చట్టం, శాంతియుత చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరుకోవడం మంచిదని మా అభిప్రాయం,” అని ట్వీట్ చేశారు. 

వీటిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందిస్తూ, “సున్నితమైన ఇటువంటి అంశాలపై అంతర్జాతీయ నాయకులు, సంస్థలు బాధ్యతారహితంగా మాట్లాడకుండా ఉంటే మంచిది. భారత్‌ ప్రభుత్వం డిల్లీ అల్లర్లను కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. అల్లర్లకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు చేపడుతోంది,” అని చెప్పారు.

Related Post