అమరావతిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌!

March 03, 2020
img

ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడాన్ని సవాలు చేస్తూ అమెరికాలో ప్రవాసాంద్రుల తరపున శ్రీనివాస్ కావేటి అనే వ్యక్తి,నెదర్‌లాండ్‌ దేశంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో మార్చి 2న ఓ పిటిషన్‌ వేశారు. అమరావతిని రాజధానిగా చేస్తానని గత ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అక్కడి రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ హామీని పట్టించుకోకుండా రాజధానిని విశాఖకు తరలిస్తోందని పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది భూములిచ్చిన రైతులను మోసం చేయడమేనని కనుక రాజధాని తరలింపును నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీనివాస్ కావేటి పిటిషన్‌ ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. 

ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, త్వరలోనే దానిపై తమ నిర్ణయం తెలియజేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. 


రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోగలదా? ఒకవేళ జోక్యం చేసుకొన్నా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోగలదా? అంటే అనుమానమే. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోగలదో లేదో అనే విషయం పక్కనపెడితే, భారత్‌లోని ఒక రాష్ట్రానికి సంబందించిన ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయడమే ఆశ్చర్యం. 

Related Post