ఇరాక్‌లో అమెరికా కార్యాలయంపై దాడి?

January 09, 2020
img

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికాతో సహా వివిదదేశాల దౌత్యకార్యాలయాలున్న గ్రీన్ జోన్ ప్రాంతంపై బుదవారం అర్ధరాత్రి రెండు రాకెట్ దాడులు జరిగాయి. అయితే అవి లక్ష్యాలకు దూరంగా పడటంతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. ఇరాక్‌లోని అబూ మహండీ అల్-మూహండీ అనే తీవ్రవాదులు తామే ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకొంది.  

ఇటీవల అమెరికా దళాలు ఇరాన్‌ ప్రముఖ నాయకుడు ఖాసీం సులేమానిపై బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట దాడిచేసినప్పుడు అతనితో పాటు అబూ మహండీ అల్-మూహండీకి చెందిన నేతలు కూడా హతమయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ దాడి చేశామని, మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని అబూ మహండీ ప్రకటించింది. 

ఇరాక్‌లోని అమెరికా సైనికస్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులతో ఇరుదేశాల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ఇరాక్‌లోని ఉగ్రవాద సంస్థ కూడా అమెరికాపై దాడులకు పూనుకోవడంతో మరింత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అబూ మహండీకి ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్నందున, ఇరాన్‌ ప్రోత్సహాంతోనే ఈ దాడులు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Post