భవనంలోకి దూసుకుపోయిన విమానం!

December 27, 2019
img

కజకిస్తాన్‌లో శుక్రవారం ఉదయం ఘోరవిమాన ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానప్రకారం శుక్రవారం ఉదయం 7.22 గంటలకు కజకిస్తాన్‌లోని ఆల్మట్టి విమానాశ్రయం నుంచి ఆ దేశ రాజధాని నూర్ సుల్తాన్‌కు బయలుదేరిన ఫోక్కర్-100 విమానం టేకాఫ్ సమయంలో నిర్ధిష్ట ఎత్తుకు చేరుకోలేకపోవడంతో విమానాశ్రయం రన్ వే ఎదురుగా ఉన్న     రెండంతస్తుల భవనంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానంలో సుమారు 95 మంది ప్రయాణికులు,  ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మరణించినట్లు తాజా సమాచారం. వారిలో ఆరుగురు చిన్న పిల్లలున్నట్లు సమాచారం. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 


Related Post