కోర్టులో ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ

November 11, 2019
img

అమెరికాలో విదేశీయులను తగ్గించుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అప్పీలేట్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవితభాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలుగా 2015లో అప్పటి అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రభుత్వం హెచ్-4 ఈఏడీ వీసాలను ప్రవేశపెట్టింది. వాటిని ట్రంప్ సర్కార్ రద్దు చేయడానికి ప్రయత్నించింది. హెచ్-4 ఈఏడీ వీసాలపై ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అప్పీలేట్ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం హెచ్-4 ఈఏడీ వీసాలలో నిబందనల మార్పు చేసేందుకు నిరాకరించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న వాషింగ్‌టన్ డీసీ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ (దిగువ కోర్టు)లోనే విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో హెచ్-4 ఈఏడీ వీసాలతో సుమారు 90,000 మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. వారందరికీ ఈ తీర్పుతో తాత్కాలిక ఉపశమనం లభించింది. అలాగే ట్రంప్ సర్కార్ ప్రయత్నాలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. 


Related Post