అమెరికా తుపాకీ సంస్కృతికి 30 మంది బలి!

August 05, 2019
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్‌తో సహా యావత్ ప్రపంచసమస్యలను పరిష్కరిస్తానని చెపుతుంటారు. కానీ అమెరికాలో దశాబ్ధాలుగా నెలకొన్న ఓ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. అదే..తుపాకీ సంస్కృతి. అమెరికా జీవనవిధానంలో అంతర్భాగంగా మారిపోయిన తుపాకీ సంస్కృతికి ఏటా వందల మంది ప్రజలు, చిన్నారులు బలైపోతూనే ఉన్నారు. కానీ ట్రంప్ కూడా దానిని నివారించలేకపోతున్నారు. కాల్పులలో ప్రజలు, విద్యార్దులు చనిపోయిన ప్రతీసారి వాటిని ట్విట్టర్‌లో ఖండించడంతో సరిపెడుతుంటారు. 

తాజాగా శనివారం కొన్ని గంటల వ్యవదిలోనే రెండు చోట్ల జరిగిన కాల్పులలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు.  టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలోని వాల్మార్ట్ షాపింగ్ మాల్లో జరిగిన కాల్పులలో 20 మంది, ఆదేరోజు డేటౌన్‌లోని నీడ్ పెప్పర్ బార్‌ బయట జరిగిన కాల్పులలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలలో మొత్తం 36 మంది గాయపడినట్లు తెలుస్తోంది. డేటౌన్ కాల్పులు జరిగిన యువకుడిని పోలీసులు మట్టుబెట్టారు. వాల్మార్ట్ షాపింగ్ మాల్లో కాల్పులకు పాల్పడినవారిలో ముగ్గురిని పోలీసులు సజీవంగా బందించినట్లు సమాచారం. 

       

శాంతిస్థాపన పేరిట అమెరికా వివిద దేశాలలో నిరంతరంగా యుద్ధాలు చేస్తూ వేలాదిమంది ప్రజలు, సొంత సైనికుల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. మరోపక్క స్వదేశంలో ఈ తుపాకీ సంస్కృతికి ఏటా వందలాదిమంది బలైపోతూనే ఉన్నారు. పామును ఆడించేవాడు ఏదో ఓనాడు అదే పాముకి బలవుతాడన్నట్లు, తుపాకీని ప్రేమించే అమెరికా కూడా అదే తుపాకీకి ప్రాణాలను ఆర్పిస్తోంది. 

Related Post