అమెరికా పత్రికలలో కాళేశ్వరం గురించి ప్రశంసలు

June 24, 2019
img

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేస్తున్నాయో అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, గొప్పదనం గుర్తించకపోయినా అమెరికాలో ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక “ది వాషింగ్టన్ పోస్ట్” మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి వివరిస్తూ, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన భారీ మోటార్లు సుమారు 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తూ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించబోతున్నాయని పేర్కొంది. ఇప్పటివరకు అమెరికాలోని కొలోరెడో, లిబియాలో ఎత్తిపోతల పధకాలే ప్రపంచలోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టులుగా ఉండేవని కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచలోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిందని పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి, పట్టుదల కారణంగానే ఇంత తక్కువ సమయంలోనే అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగలిగిందని ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
Related Post