రష్యాలో ఘోర విమాన ప్రమాదం

May 06, 2019
img

రష్యాలో చాలా ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు మాస్కోలోని  షెరమిత్యేవో ఎయిర్‌పోర్టు నుంచి సూపర్‌జెట్‌-100 విమానం ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ముర్మాన్స్క్‌ నగరానికి బయలుదేరింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానం పిడుగుపాటుకు గురవడంతోవిమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తింది. ఇది గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి రన్-వేపై దించుతుండగా విమానం వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్లు అతికష్టం మీద విమానాన్ని రన్ వేపై భద్రంగా దించగలిగారు, ఆ తరువాత విమానం అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణికులను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. కానీ కొందరు ప్రయాణికులు తమ లగేజీలను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ విలువైన సమయం వృధా చేసుకొని మంటలలో కాలి సజీవ దహనమైపోయారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమాన సిబ్బందితో కలిపి మొత్తం 78 మంది ఉండగా, వారిలో 41 మంది మంటలలో సజీవదహనం అయిపోయారు. 

గాల్లో ఉండగా విమానంపై పిడుగుపాటుకు గురవడం ఒక దురదృష్టం అనుకొంటే, మంటలంటున్నప్పటికీ పైలట్ విమానాన్ని భద్రంగా నేలపై దింపి ప్రాణాలు కాపాడుకొనే అవకాశం కల్పించినా అవివేకంగా వ్యవహరించి మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం దౌర్భాగ్యం కాక మారేమిటి?

Related Post