శ్రీలంక ఉగ్రదాడులు మాపనే: ఐసిస్

April 23, 2019
img

మొన్న ఆదివారం ఉదయం శ్రీలంక రాజధాని కొలొంబోలో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళు తమ పనేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడుల కోసం శ్రీలంకలోని ‘ది నేషనల్ తవ్హీద్ జమౌత్’, ‘జమ్మియాతుల్ మిల్లతు ఇబ్రహీం’ అనే రెండు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు తామే అవసరమైన శిక్షణ, సహాయసహకారాలు అందించమని ఐసిస్ ప్రతినిధి ఒక మీడియా సంస్థకు తెలియజేశాడు. ఇటీవల న్యూజిలాండ్ మసీదులో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ఐసిస్ ప్రతినిధి తెలిపాడు. 

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 321కి చేరుకొంది. తీవ్ర గాయాలపాలై వివిద ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 500 మందిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

శ్రీలంకపై ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉందని తామే ముందే హెచ్చరించామని భారత్‌, అమెరికా నిఘా వర్గాలు చెప్పడం విశేషం. ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చుననే భారత్‌, అమెరికా అనుమానాలు నిజమని ఐసిస్ ప్రకటనతో స్పష్టం అయ్యింది. కానీ ఇటువంటి భీకరదాడులు చేసినప్పుడు ఐసిస్ సంస్థ వెంటనే అది తమ పనేనని ప్రకటించుకొంటుంది కానీ ఈసారి రెండు రోజుల సమయం తీసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

Related Post