భారత్‌పై హెచ్-4 బాంబు?

February 26, 2019
img

భారత్‌పై హెచ్-4 బాంబు పడనుంది. అయితే అది పాకిస్థాన్‌ వేయబోయే బాంబు పేరు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-4 వీసాలను నిషేదిస్తూ తీసుకోబోయే నిర్ణయం. భారత్‌కు అది బాంబువంటిదే. అమెరికాలో హెచ్-1 వీసాలతో ఉద్యోగాలు చేసుకొంటున్నవారి జీవితభాగస్వాములకు కూడా ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించేవే హెచ్-4 వీసాలు. బారక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ఆ వీసాల వలన సుమారు లక్షమంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందగలిగారు. 

‘అమెరికన్స్ ఫస్ట్’ అనే ట్రంప్ నినాదానికి అనుకూలంగా ఆ వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం సిద్దం అవుతోంది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం ఆ ప్రతిపాదనలను అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి పంపింది. ఆయన అభీష్టం మేరకే ఆ ప్రతిపాదన రూపొందించబడింది కనుక దానికి ఆయన ఆమోదముద్ర వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. వాటి అమలుకు అమెరికన్ కాంగ్రెస్‌( పార్లమెంటు) న్యాయస్థానాలు అంగీకరించవలసి ఉంటుంది. అది వేరే విషయం. కానీ హెచ్-4 వీసాల నిషేధానికి తొలి అడుగు పడినట్లే భావించవచ్చు. ఇది ఎప్పటిలోగా అమలులోకి వస్తుందో తెలియదు కానీ అమలుచేయడం తధ్యమేనాని చెప్పవచ్చు. 

ఇది అమలులోకి వస్తే ఆ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నవారు వాటిని కోల్పోతారు కనుక ఇంటికే పరిమితం కావలసి ఉంటుంది. కానీ అమెరికాలో ఒక్కరి సంపాదనతో కుటుంబమంతా బతకడం చాలా కష్టం. కనుక స్వదేశానికి తిరిగివెళ్ళక తప్పదు. 

Related Post