విద్యార్ధుల విడుదలకు తానా బృందం కృషి

February 04, 2019
img

అమెరికా ఎఫ్.బి.ఐ. ఉచ్చులో చిక్కుకొని టెక్సాస్ జైలులో నిర్బందించబడి ఉన్న భారతీయ విద్యార్ధులను విడిపించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తీవ్రంగా కృషి చేస్తోంది. తానా అధ్యక్షుడు సతీష్ వేమన తానా సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మానవీయకోణంలో ఆలోచించి అమెరికా పోలీసుల అదుపులో ఉన్న విద్యార్ధులను విడిపించి ఆదుకోవాలని, వారి భవిష్యత్ పాడవకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ అయిన విద్యార్ధులందరూ చాలా వ్యయప్రయాసలకోర్చి అమెరికా వచ్చారు కనుక వారందరికీ అమెరికాలో వేరే యూనివర్సిటీలలో చేరేందుకు అనుమతించవలసిందిగా భారత్ ప్రభుత్వం చేత అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్ధింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్ధనపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందిస్తూ తన శక్తి, పరిధి మేర విద్యార్ధులను విడిపించి మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Related Post