ఐటిసర్వ్ ప్రతినిధులతో ఏపీ సిఎం చంద్రబాబు సమావేశం

September 25, 2018
img

అమెరికా పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూయార్క్ లో ఐటిుసర్వ్ అలయన్స్ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. గ్రాండ్ హయాత్ న్యూ యార్క్ లో జరిగిన ఈ సమావేశంలో ఐటినసర్వ్ అలయన్స్ సభ్యత్వం కలిగి ఉన్న సుమారు 30 ఐటిూ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. వారికి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించి, ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరారు. వైజాగ్, విజయవాడ, అమరావతి, చిత్తూరులో ఐటిత సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.    

అక్టోబరులో జరుగనున్న ఐటిా సర్వ్ అలయన్స్ సినర్జీ 2018 వార్షిక సదస్సుకు సంబందించిన సినర్జీ యానిమేషన్ లోగోను చంద్రబాబు నాయుడు వారి సమక్షంలో ఆవిష్కరించారు. ఐటి  సర్వ్ అలయన్స్ సినర్జీ 2018 వార్షిక సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 


ఈ సదస్సులో పాల్గొనేందుకు టికెట్స్ పై 15% డిస్కౌంట్ లభిస్తుంది. ఐటిసర్వ్ అలయన్స్ సినర్జీ 2018 వార్షిక సదస్సుకు సంబందించిన తాజా సమాచారం, వివరాల కోసం ఈ క్రిందనీయబడిన వెబ్ సైట్స్ మరియు సోషల్ మీడియా లింక్స్ లో చూడవచ్చు.  

Website: www.ITServeSynergy.org   

Facebook: www.facebook.com/ITServeAlliance   

LinkedIn: https://www.linkedin.com/company/7794223   

Twitter:  www.twitter.com/ITServeorg   

ఐటిసర్వ్ అలయన్స్ సంస్థ లాభాపేక్షలేకుండా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐటిసర్వ్ అలయన్స్ సంస్థలో సభ్యులుగా ఉన్న ఐటి కంపెనీలకు ఐటి రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అత్యాధునిక టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఐటి కంపెనీలు పరస్పరం వ్యాపార సంబందాలు మెరుగుపరుచుకొనేందుకు, అదేవిధంగా ఉద్యోగాల ఖాళీల వివరాలు, ఉద్యోగాల భర్తీకి తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడంలో ఐటిసర్వ్ అలయన్స్ సంస్థ సహాయసహకారాలు అందిస్తుంటుంది. 

ఐటిసర్వ్ అలయన్స్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ పాలసీలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే ఐటి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తుంటుంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ ఐటి కంపెనీలన్నిటికీ ఇది వేదికగా నిలిచి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటుంది. 

ఇన్ని ప్రయోజనాలు ఉన్నందునే ఏటా ఐటిసర్వ్ అలయన్స్ లో చేరే ఐటి కంపెనీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆ కారణంగా ఇప్పుడు ఐటిసర్వ్ అలయన్స్ అమెరికాలోని ఐటి కంపెనీలకు ‘గొంతు’గా నిలుస్తోంది. 

రండి అందరం చేతులు కలుపుదాం. కలిసి పనిచేద్దాం... కలిసి అభివృద్ధి చెందుద్దాం. అమెరికాలోని అన్ని ఐటి కంపెనీలు, ఐటి ఉద్యోగులను అందించే కంపెనీలు ఐటిసర్వ్ అలయన్స్ లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి www.itserve.org /register  వెబ్ సైట్ ను సందర్శించగలరు.

Related Post