అమెరికాలో అతిపెద్ద ఐటి సదస్సు: అక్టోబర్ 25,26 తేదీలలో

September 18, 2018
img

ఈ ఏడాది అక్టోబర్ 25,26వ తేదీలలో అట్లాంటిక్ సిటీ, న్యూజెర్సీలో హరా రిసార్ట్స్ లో ఐటిసర్వ్ అలయన్స్ సినర్జీ 2018 వార్షిక సదస్సు జరుగబోతోంది. అమెరికాలో జరుగబోతున్న అతిపెద్ద ఐటి సదస్సు ఇదే. ఐటిసర్వ్ అలయన్స్ సంస్థలో సభ్యత్వం కలిగిన వందాలది ఐటి కంపెనీలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నాయి. ఆ వార్షిక సదస్సుకు అవసరమైన సన్నాహాల గురించి చర్చించేందుకు సెప్టెంబరు 14వ తేదీన ఎడిసన్, న్యూజెర్సీలో జరిగిన సన్నాహక సమావేశంలో ఐటిసర్వ్ అలయన్స్ సంస్థలో సభ్యత్వం కలిగిన 300 సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. ఆ సదస్సుకు సంబందించి ప్రచార కార్యక్రమాలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ సన్నాహక సమావేశంలో సినర్జీ 2018 వార్షిక సదస్సు యానిమేటడ్ సినర్జీ లోగోను ఆవిష్కరించారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు టికెట్స్ పై 15% డిస్కౌంట్ లభిస్తుంది. ఐటిసర్వ్ అలయన్స్ సినర్జీ 2018 వార్షిక సదస్సుకు సంబందించిన తాజా సమాచారం, వివరాల కోసం ఈ క్రిందనీయబడిన వెబ్ సైట్స్ మరియు సోషల్ మీడియా లింక్స్ లో చూడవచ్చు.  

Website: www.ITServeSynergy.org  

Facebook: www.facebook.com/ITServeAlliance  

LinkedIn: https://www.linkedin.com/company/7794223  

Twitter:  www.twitter.com/ITServeorg  

ఐటిసర్వ్ అలయన్స్ సంస్థ లాభాపేక్షలేకుండా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐటిసర్వ్ అలయన్స్ సంస్థలో సభ్యులుగా ఉన్న ఐటి కంపెనీలకు ఐటి రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అత్యాధునిక టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఐటి కంపెనీలు పరస్పరం వ్యాపార సంబందాలు మెరుగుపరుచుకొనేందుకు, అదేవిధంగా ఉద్యోగాల ఖాళీల వివరాలు, ఉద్యోగాల భర్తీకి తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడంలో ఐటిసర్వ్ అలయన్స్ సంస్థ సహాయసహకారాలు అందిస్తుంటుంది. ఐటిసర్వ్ అలయన్స్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ పాలసీలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే ఐటి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తుంటుంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ ఐటి కంపెనీలన్నిటికీ ఇది వేదికగా నిలిచి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందునే ఏటా ఐటిసర్వ్ అలయన్స్ లో చేరే ఐటి కంపెనీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆ కారణంగా ఇప్పుడు ఐటిసర్వ్ అలయన్స్ అమెరికాలోని ఐటి కంపెనీలకు ‘గొంతు’గా నిలుస్తోంది. 

రండి అందరం చేతులు కలుపుదాం. కలిసి పనిచేద్దాం... కలిసి అభివృద్ధి చెందుద్దాం. అమెరికాలోని అన్ని ఐటి కంపెనీలు, ఐటి ఉద్యోగులను అందించే కంపెనీలు ఐటిసర్వ్ అలయన్స్ లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి www.itserve.org/register వెబ్ సైట్ ను సందర్శించగలరు.

Related Post