బోస్టన్ లో ప్రేలుళ్ళు

September 14, 2018
img

అమెరికాలోని బోస్టన్ నగరంలో ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్లు పేలిపోవడంతో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకేసారి వరుసగా 70 ప్రేలుళ్ళు జరిగినట్లు సమాచారం. తక్షణమే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకొని ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారిని అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా 12 మంది గాయపడినట్లు సమాచారం. 

ఆ ప్రాంతానికి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న కొలంబియా గ్యాస్ ఆఫ్ మస్సాచుసెట్స్ కంపెనీ గత కొన్ని రోజులుగా అక్కడ కొత్త పైప్ లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఆ సందర్భంగా వాటిలో గ్యాస్ సరఫరా చేసి పరీక్షిస్తునప్పుడు, అధిక ఒత్తిడి కారణంగా కొన్ని చోట్ల పైప్ లైన్లు పగిలి ఈ ప్రేలుళ్ళు జరిగి ఉండవచ్చని స్థానిక అగ్నిమాపక అధికారి మైకేల్ మ్యాన్స్ ఫీల్డ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి దర్యాప్తు మొదలుపెట్టారు. 


Related Post