పాక్ మాజీ ప్రధానికి 10 ఏళ్ళు జైలు శిక్ష

July 06, 2018
img

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు అవినీతికేసులలో 10 ఏళ్ళ జైలుశిక్షతో పాటు 80 లక్షల పౌండ్ల జరిమానా విధించబడింది. ఇదే కేసులో అయన కుమార్తె మర్యం నవాజ్ కు ఏడేళ్ళ జైలుశిక్ష, 20 లక్షల పౌండ్ల జరిమానా, నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ కు ఏడాది జైలుశిక్ష విధించబడింది.     

పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణ జరిపి కోర్టుకు సమర్పించిన ఆధారాలతో విచారణ జరిపిన పాక్ కోర్టు వారికి శుక్రవారం మధ్యాహ్నం ఈ శిక్షలు ఖరారు చేసింది నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ షరీఫ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున ఆమెకు లండన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కనుక నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె చాలా కాలంగా లండన్ లోనే ఉంటున్నారు. కనుక వారిక పాకిస్తాన్ తిరిగివెళ్ళకపోవచ్చు. నవాజ్ అల్లుడు మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. కనుక అతనిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 


Related Post