శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకేసుపై కోర్టు తీర్పు

May 05, 2018
img

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసిన అమెరికన్ ఆడం పురిటన్ (52)కు అమెరికా ఫెడరల్ కోర్టు 14 ఏళ్ళు  జైలుశిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 22న శ్రీనివాస్, అయన స్నేహితుడు అలోక్ మాడసాని కాన్సస్ రాష్ట్రంలో ఓలెత్ నగరంలో ఒక బార్ లో ఉన్నప్పుడు, వారిపై ఆడం పురిటన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ చనిపోగా, అలోక్ స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత విదేశీయులు అందరూ దేశం విడిచివెళ్ళిపోవాలన్నట్లు, అలాగే విదేశీయుల వలన అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారన్నట్లు మాట్లాడుతుండటంతో ఆడం పురిటన్ వంటి జాత్యాహంకారులు రెచ్చిపోయారు. అమెరికాలో పనిచేస్తున్న శ్రీనివాస్ కూచిభొట్ల వంటివారు వారి జాత్యాహంకారానికి అన్యాయంగా బలైపోయారు. ఫెడరల్ కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య స్వాగతించారు. “దీని వలన పోయిన నా భర్త తిరిగిరాదు కానీ జాత్యాహంకారంతో దాడులకు పాల్పడితే ఏమవుతుందో కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ కేసులో దోషికి శిక్ష పడేందుకు నిష్పక్షపాతంగా కృషి చేసిన పోలీసులకు, న్యాయస్థానానికి నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. 


Related Post