విజయ్ మాల్యా మళ్ళీ పెళ్ళికి సిద్దం

March 29, 2018
img

బ్యాంకులకు రూ.9,000 ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా 62 ఏళ్ళ వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్ళికి సిద్దమవుతున్నాడు. ఇదివరకు విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లోనే ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన పింకీ లాల్వానీని పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఆమెతో పరిచయం ప్రేమగా మారిన తరువాత మూడేళ్ళు సహజీవనం చేసి చివరకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు.  

విజయ్ మాల్యా మొదటి భార్య పేరు సమీర త్యాబ్జి. ఆమె మొదట ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసేవారు. వారికి సిద్దార్ద్ మాల్యా అనే ఒక కొడుకు ఉన్నాడు. కొన్నేళ్ళు కాపురం తరువాత వారు విడిపోయారు. ఆ తరువాత రేఖ అనే ఆమెను వివాహం చేసుకొన్నాడు. ఆమెకు అప్పటికే వేరే వ్యక్తితో పెళ్ళి జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి బాగోగులు తానే చూసుకొంటానని హామీ ఇచ్చి ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. వారికి లియనా, తాన్యా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం వారు ముగ్గురూ అమెరికాలో ఉంటున్నారు. విజయ్ మాల్యా ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్దమవుతున్నాడు. 


Related Post