డిజిటల్ తరగతులకు పరికరాలు అందజేసిన ఎన్.ఆర్.ఐ.లు

February 28, 2018
img

విదేశాలలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులు తెలంగాణా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుంటూనే ఉన్నారు. ఉడతాభక్తిగా తమవంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కె.సముద్రం మండలంలో ఇముగుత్తికి చెందిన మహబూబాబాద్ జిల్లా ఎన్.ఆర్.ఐ.ఫౌండేషన్ సభ్యులు స్వప్నప్రియ, జితేందర్ రెడ్డి దంపతులు 18 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ కోసం రూ.3.06 లక్షలు విలువగల ఎల్.ఈ.డి.టీవీలు, పాట్యాంశాలు కలిగిన పెన్ డ్రైవ్ లు అందజేశారు. 

మహాబూబాద్ జిల్లా కె.సముద్రం (స్టేషన్) జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో మంగళవారం జరిగిన ఈ డిజిటల్ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఎం.ఈ.ఓ. బి.నరసింహరావు గారి అధ్యక్షత వహించగా, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.దామోదర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డి.ఈ.ఓ. కెఎస్.సత్యప్రియ చేతుల మీదుగా డిజిటల్ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రదానోపాద్యాయులు, అధ్యాపకులు, విద్యార్ధులు, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సభ్యులు బి.నాగేశ్వర్ రావు, పి.రంగారావు, జి.రాంరెడ్డి స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. 

  



Related Post