ఫ్లోరిడాలో దారుణం!

February 15, 2018
img

అమెరికా తుపాకుల సంస్కృతి వికృత రూపం మళ్ళీ బుధవారం మరొకసారి ప్రదర్శితమైంది. ఒక టీనేజ్ యువకుడు తుపాకీ చేత పట్టుకొని వచ్చి ఇదివరకు తను చదివిన పాఠశాలలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే 17 మంది విద్యార్ధులు చనిపోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్ ల్యాండ్ లోని మార్జోయ్ స్టోన్ మన్ డగ్లస్ హైస్కూలులో ఈ దారుణం జరిగింది. ఆ స్కూల్   నుంచి ఇదివరకు సస్పెండ్ చేయబడిన నికోలస్‌ క్రూజ్ అనే 19 ఏళ్ళు వయసున్న విద్యార్ధి స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం తుపాకీ చేతపట్టుకొని వచ్చి ప్రవేశ ద్వారం వద్ద కనిపించిన ముగ్గురిని కాల్చి చంపేశాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ఫెయిర్ అలారం మ్రోగించడంతో లోపల ఉన్న ఉపాద్యాయులు, విద్యార్ధులు బయటకు వచ్చారు. నికోలస్‌ క్రూజ్ ప్రవేశద్వారం వద్ద నిలబడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే 17 మంది విద్యార్ధులు చనిపోయారు. ఈ కాల్పుల ఘటనలో మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. కాల్పులు జరిపిన తరువాత అతను స్కూల్ లో దూరి దాక్కొన్నాడు. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు స్కూల్ భవనాన్ని చుట్టుముట్టి అతనిని పట్టుకొన్నారు. 


Related Post