ట్రంప్ కు మద్దతుగా వైట్ హౌస్ ముందు ర్యాలీ

February 02, 2018
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డ్స్, హెచ్-1 బి వీసాల జారీ విధానాలలో చేస్తున్న సంస్కరణలకు మద్దతు తెలుపుతూ అమెరికాలోని రిపబ్లికన్ హిందూ కొయిలేషన్ (ఆర్.హెచ్.సి.) ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వైట్ హౌస్ ముందు ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి అమెరికాలో స్థిరపడిన భారతీయులు వారి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా శ్రేయస్సును, అమెరికాలో స్థిరపడిన లక్షలాది విదేశీయుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపవలసిన అవసరం ఉందని, అందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్.హెచ్.సి. ఉపాధ్యక్షురాలు మనస్వి కుమార్ తెలిపారు. ఇది ట్రంప్ సర్కార్ విధానాలకు మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న ర్యాలీ కనుక దీనిని ప్రభుత్వం అనుమతించిందని ఆమె తెలిపారు. కనుక అన్ని రాష్ట్రాల నుంచి ప్రవాస భారతీయులు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు తెలుపాలని ఆమె కోరారు. డల్లాస్, అట్లాంటా, న్యూజెర్సీ, చికాగో, వెస్ట్ వర్జీనియా తదితర ప్రాంతాల నుంచి అనేకమంది ఈ ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్నారని ఆమె తెలిపారు. మిగిలిన అన్ని ప్రాంతాల నుంచి కూడా బారీ సంఖ్యలో భారతీయులు తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

Related Post