గుజరాత్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడి ఓ తండ్రీకూతుర్లు ఓ దుండగుడి కాల్పులలో చనిపోయారు.
సుమారు ఆరేళ్ళ క్రితం ప్రదీప్ పటేల్ తన భార్య, కూతురుతో కలిసి వర్జీనియాకి వెళ్ళి అక్కడే ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్ పెట్టుకొని స్థిరపడ్డారు.
గురువారం ఉదయం ఓ వ్యక్తి మద్యం బాటిల్ కొనేందుకు వచ్చినప్పుడు, మంగళవారం రాత్రి స్టోర్ తొందరగా ఎందుకు మూసేశారని క్యాష్ కౌంటర్‌లో ఉన్న ప్రదీప్ పటేల్‌తో గొడవ పెట్టుకున్నాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన కుమార్తె ఊర్మి (24) ఆ వ్యక్తికి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుండగా, అతను హటాత్తుగా జేబులో నుంచి తుపాకీ తీసి ఇద్దరిపై కాల్పులు జరిపాడు.
ప్రదీప్ పటేల్ ఘటనాస్థలంలోనే చనిపోగా, ఊర్మి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వర్జీనియా పోలీసులు వారిపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. భర్త, కూతురు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో ప్రదీప్ పటేల్ భార్య పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.