ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రాష్ట్రానికి ఊహించిన దానికంటే రెట్టింపు పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సదస్సులో రాష్ట్రానికి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
వాటిలో అమెజాన్ సంస్థ ఒక్కటే ఏకంగా రూ.58,00 0 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో అది తన అమెజాన్ వెబ్‌సైట్ సర్వీసస్ క్లౌడ్ సెంటర్ విస్తరణ చేపడుతుంది. దీని ద్వారా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ రంగాలలో తెలంగాణ అగ్రగామిగా మారుతుంది.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మా ప్రభుత్వం, మా రాష్ట్రంపై నమ్మకముంచి ఇంత భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు. ఇది మా ప్రభుత్వ విధానాలకు, స్థిరత్వానికి మరో నిదర్శనంగా భావిస్తున్నాము. 2047 నాటికి తెలంగాణని మూడు ట్రిలియన్ డాలర్ల బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ దిశలో పడిన తొలి అడుగు ఇది,” అని అన్నారు.