శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్‌: విష్ణు విన్యాసం!

December 17, 2025


img

విలక్షణ కథలు, పాత్రలు ఎంచుకొని సినిమాలు చేసే శ్రీవిష్ణు తాజా చిత్రం  టైటిల్‌ ‘విష్ణు విన్యాసం’ కూడా విలక్షణంగానే ఉంది. టైటిల్‌ గ్లిమ్స్‌ కూడా వెరైటీగానే ఉంది. ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడీగా నాయన సారిక నటిస్తున్నారు. మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: యదునాథ్ మారుతి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: సాయి శ్రీరాం, ఎడిటింగ్: కార్తికేయన్ రోహిణి, కోరియోగ్రఫీ: భాను, ఈశ్వర్ పెంటి, స్టంట్స్: విజయ్, పృథ్వి, ఆర్ట్: ఏ రామాంజనేయులు చేశారు.  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష