పురుషః: గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే!

December 17, 2025


img

వీరు వులవల దర్శకత్వంలో బత్తుల పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా పేరు పురుషః. భార్యల నుంచి స్వేచ్చ కోసం భర్తలు చేసే పోరాటాలు ఏవిదంగా ఉంటాయో చూపించబోతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పోస్టర్లో హీరో ఫోటో వేసి ‘గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే! వైఫ్ వెర్సస్ సీజర్ మ్యాన్’ అంటూ పెట్టిన ట్యాగ్ అందరినీ ఆకట్టుకుంది.

నేడు మరో పోస్టర్‌ పెట్టారు. దానిలో ‘కంటి చూపుతో కాదు కన్నీళ్ళతో చంపేస్తా,’ అంటూ హీరోయిన్‌ ఫోటో రెండు కత్తుల మద్య హీరో ఫోటో పెట్టారు. 

ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసినీ సుదీర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. వెన్నెల కిషోర్‌, సప్తగిరి, రాజీవ్ కనకాల, కసిరెడ్డి రాజ్ కుమార్‌, వీతీవీ గణేశ్, మిర్చి కిరణ్, గబి రాక్, అనైరా గుప్తా, పమ్మిసాయి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరాం ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించారు. 

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల వెంకటేశ్వర రావు తీసిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష