మోహన్ లాల్ వృషభ ట్రైలర్‌

December 17, 2025


img

మలయాళ నటుడు మోహన్ లాల్, సమర్‌జిత్ లంకేష్ ప్రధానపాత్రలు చేసిన ‘వృషభ’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ విడుదలైంది. చారిత్రిక, వర్తమానం రెండు వేర్వేరు కాలాలలో తండ్రీ కొడుకుల మద్య అనుబంధం, వారి పోరాటాలని వృషభగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు నంద కిషోర్‌. 

ఈ సినిమాలో నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్, నేహా సక్సేనా, వినయ్ వర్మ, గరుడ రామ్, అలీ, కిషోర్, అయ్యప్ప పీ శర్మ ముఖ్యపాత్రలు చేశారు. 

వృషభ సినిమాకి సంగీతం: సామ్ సీఎస్, కెమెరా:  ఆంటోని సామ్‌సన్, డైలాగ్స్: ఎస్‌.ఆర్‌.కే, జనార్ధన్ మహర్షి, కార్తిక్

ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్, యాక్షన్: పీటర్ హేన్, స్టంట్ సిల్వా, గణేష్ కుమార్, నిఖిల్, కోరియోగ్రఫీ : కృతి మహేశ్ చేశారు. 

బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్, కనెక్ట్ మీడియా సమర్పణలో, అభిషేక్. ఎస్.వ్యాస్ స్టూడియోస్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్.వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నానీ, జూహీ పారేఖ్ మెహతా కలిసి పాన్ ఇండియా మూవీగా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ నెల 25న వృషభ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/HLNYbvGhklY?si=Bz-4GzbQrLNdtBt0" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష