కోలీవుడ్ హీరో కార్తి నటించిన తమిళ సినిమా ‘వా వాతియార్’ (తెలుగులో అన్నగారు వస్తారు) డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా 12కి వాయిదా పడింది. కానీ 12న కూడా విడుదల కాలేదు. ఇప్పుడు డిసెంబర్ 25న తప్పకుండా అన్నగారు వస్తారని చెపుతున్నారు. ఆలోగా కోర్టు బయట న్యాయ వివాదం పరిష్కరించుకునేందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ సమస్య పరిష్కారమై మద్రాస్ హైకోర్టు సినిమాపై స్టే ఎత్తివేస్తే డిసెంబర్ 24న ప్రీమియర్స్ వేసి, 25న సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన అర్జున్ లాల్ సుందర్ దాస్‌కు వడ్డీతో కలిపి మొత్తం 21.78 కోట్లు నిర్మాత జ్ఞానవేల్ రాజా చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించలేదు. కనుక సుందర్ దాస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమా రిలీజ్ చేయకుండా స్టే విధించింది.
ఈ సినిమాలో కార్తికి జోడీగా కృతి శెట్టి నటించారు. సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, జి.ఎం. సుందర్, రమేష్ తిలక్, పి.ఎల్. తెనప్పన్, విద్యా బోర్జియా, నివాస్ అధితాన్, మధుర్ మిట్టల్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కథ, దర్శకత్వం: నలన్ కుమారస్వామి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఆర్ట్ డైరెక్టర్: డి. ఆర్.కె.కిరణ్, ఎడిటింగ్: వెట్రే కృష్ణన్, యాక్షన్: ‘అనల్’ అరసు, నృత్య దర్శకత్వం: సాండీ, ఎం.షెరీఫ్ చేశారు.
ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజాసాబ్ నిర్మించారు.