ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో రాజాసాబ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి. మొదటి పాట గ్రూప్ సాంగ్ కాగా రెండో పాట హీరో హీరోయిన్ల రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్. మొదటి పాటకి థమన్ అందించిన సంగీతం నిరాశ పరిచిందనే చెప్పాలి.
ఓ సినిమాలో 4-5 పాటలు ఉంటే వాటిలో అన్నీ ఆకట్టుకోకపోవచ్చు. ఒకటో రెండో క్యాచీగా సూపర్ హిట్ అవ్వచ్చు. కనుక రాజాసాబ్ మొదటి పాట కూడా అలాగే అనుకున్నా రెండో పాట కూడా నిరాశ పరిచిందనే చెప్పాలి.
ముఖ్యంగా దర్శకుడు మారుతి అత్యుత్సాహం ప్రదర్శించి ఈ పాటని నోరు తిరగని సంస్కృత పదాలతో వ్రాయడం, దానికి థమన్ అందించిన రోటీన్ సంగీతం, ఆ పాటకి రోటీన్ కోరియోగ్రఫీ... అన్నీ కలిపి నిరాశ పరిచాయి.
బహుశః మారుతి, థమన్‌లకు ఇప్పటికే ఈ ఫీడ్ వచ్చే ఉంటుంది. కానీ ఇప్పటికే పాటల రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కనుక ఇక రాజాసాబ్ మిగిలిన పాటలు ఎలా ఉంటే అలా స్వీకరించక తప్పదేమో? ఆరు నెలలు లేదా ఏడాదిలో పూర్తి చేయాల్సిన సినిమాని ఏళ్ళ తరబడి తీస్తే చివరికి ఇలాగే జరుగుతుందేమో?