అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ టీజర్ నేడు విడుదలయ్యింది. ఇప్పటి వరకు అడవి శేష్ నటించిన సినిమాలు కర్మ, కిస్, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్: ది సెకండ్ కేస్ అన్నీ యాక్షన్ సినిమాలే. డెకాయిట్ కూడా అటువంటిదే.. అని టీజర్‌తో స్పష్టం చేశారు.
షనీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: అడవి శేష్, షనీల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ధనుష్ భాస్కర్, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్, యాక్షన్: ఏ విజయ్ చేస్తున్నారు.
డెకాయిట్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా మార్చి 19న విడుదల కాబోతోంది.