తెలంగాణ తుది విడత పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. మొత్తం 4,159 సర్పంచ్ పదవులకు గాను 4,146 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో కాంగ్రెస్ మద్దతుదారులు 2246, బీఆర్ఎస్ పార్టీ 1163, బీజేపి 246, ఇతరులు 491 స్థానాలు గెలుచుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 12,727 గ్రామ పంచాయితీలకు 12,698 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా వాటిలో కాంగ్రెస్ మద్దతుదారులు 6822 , బీఆర్ఎస్ పార్టీ 3519 , బీజేపి 703 , ఇతరులు 1654 స్థానాలు గెలుచుకున్నారు.
సాధారణంగా గ్రామ పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 శాతం సీట్లు సాధించినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ 3519 సీట్లు గెలుచుకొని గ్రామ స్థాయిలో నేటికీ తమకు తిరుగులేద నిరూపించు కుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి హెచ్చరికవంటిదే అని చెప్పవచ్చు.
గ్రామస్థాయి ఎన్నికలలో బీజేపీ 703 సీట్లు గెలుచుకోవడం విశేషమే. కానీ తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఇప్పుడీ పంచాయితీ ఎన్నికలలో ఇలా మూడో స్థానంలో ఉండిపోవడం రాష్ట్ర స్థాయి నాయకుల అలసత్వానికి, పనితీరుకి అద్ధం పడుతోంది.