శివాజీ, బిందు మాధవి, నవ్‌దీప్, మురళీధర్ గౌడ్ ముఖ్యపాత్రలు చేస్తున్న ‘దండోరా’ నుంచి కాసర్ల శ్యామ్ వ్రాసిన ‘నిను మోసినా నను మోసినా అమ్మా పేగు ఒకటే...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ అద్భుతంగా ఉంది. మార్క్ కే రాబిన్ స్వరపరిచి సంగీతం అందించడమే కాకుండా ఆంథోనీ దాసన్ కలిసి అద్భుతంగా పాడారు.
తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో మురళీకాంత్ దేవసోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దండోరా’లో రవికృష్ణ, మణిక, మౌనిక రెడ్డి, రాధ్యా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోథ్, సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి చేశారు.
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని శ్రీలక్ష్మి సమర్పణలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందు దండోరా వేయబోతున్నారు.