పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇటు కల్వకుంట్ల కవిత కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వాదిస్తున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్పే అయితే నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో నయాన్నో భయన్నో చేర్పించుకోవడం కూడా తప్పే కదా? కేస్ ప్రభుత్వం ఈ తప్పు ఒకసారి కాదు... రెండు సార్లు చేసింది కదా?
అప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని కాంగ్రెస్, టీడీపి నేతలు కూడా ఇలాగే స్పీకర్ చుట్టూ తిరిగినప్పుడు వేటు వేశారా? లేదు కదా? పైగా వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా? అప్పుడు ఆ చేరికలను గట్టిగా సమర్ధించుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పనిచేస్తే ఎందుకు తప్పు పడుతున్నారు? పైగా నాడు తాము చేసిన ఆ తప్పు అసలు గుర్తు లేన్నట్లు ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్ధం కాదు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మేము భావించాం. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారి తీర్పు చాలా దారుణంగా ఉంది.
— Telangana Jagruthi (@TJagruthi) December 18, 2025
ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారని అందరికీ తెలుసు. కానీ ఆధారాలు లేవని స్పీకర్ గారు అంటున్నారు.
ఇది కచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే.
-… pic.twitter.com/yFUK9yx0Yl