మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సూపర్ హిట్ అవడంతో హీరోతో సహా చిత్ర బృందం చాలా ఆనందంగా ఉన్నారు. అయితే రామ్ పోతినేని మాత్రం ఆ సినిమా సక్సస్ ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేయకుండా వెంటనే తర్వాత సినిమాకి సిద్ధం అయిపోతున్నారు. దర్శకుడు కిషోర్ గోపు చెప్పిన కధ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆర్కా మీడియా బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబోతున్నారు. జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆలోగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు దర్శకుడు కిషోర్ గోపు చకా చకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరుకి లేదా సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.