టర్కీలో మళ్ళీ మరోసారి భూకంపం

February 21, 2023
img

టర్కీలో మళ్ళీ మరోసారి భూకంపం సంభవించింది. టర్కీ- సిరియా సరిహద్దు ప్రాంతంలో హతాయ్ ప్రావిన్స్ లోని లాటాకియా, అంటాక్యా అనే రెండు ప్రాంతాలలో సుమారు పది సెకండ్లపాటు భూమి కంపించింది. అక్కడ ఇదివరకు ఫిభ్రవరి 6వ తేదీన వచ్చిన భూకంపంతో బలహీనపడిన అనేక భవనాలు కూలిపోయిన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఫిభ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియా ఆగ్నేయ ప్రాంతంలో 7.8 తీవ్రతతో పెను భూకంపం రాగా వేలాది ఇళ్ళు కూలిపోయాయి. ఆ శిధిలాల క్రింద ఇప్పటివరకు 46,000 మందికి పైగా చనిపోయారు. ఆ శిధిలాల తొలగింపు కొనసాగుతుండగానే మళ్ళీ నిన్న రాత్రి మరోసారి తీవ్రస్థాయిలో భూకంపం రావడం ప్రజలు భయాందోళనలతో వణికిపోతు ఇళ్ళలో నుంచి బయటకి పరుగులు తీశారు. 

టర్కీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ మానవతాదృక్పదంతో భూకంప బాధితులకి సహాయపడేందుకు ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలని, మందులు, ఆహార పదార్దాలు వగైరా పంపించింది. టర్కీ-సిరియాలు ఐసిఎస్ వంటి ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్నప్పటికీ, భూకంప బాధితులని ఆదుకొనేందుకు భారత్‌తో ప్రపంచదేశాలన్నీ సహాయ చర్యలు చేపడుతున్నాయి. 

Related Post