శ్రీదేవికి బ్యాండ్ మేళం జన్మదిన శుభాకాంక్షలు

December 20, 2025


img

పెద్ద సినిమాలు రోటీన్ మాస్ మసాలతో సాగిపోతుంటే చిన్న సినిమాలు మాత్రం మన మట్టి మన భాష, మన పల్లెలు, మన సంస్కృతీ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను ప్రతిభింబిస్తూ అందరినీ అలరిస్తున్నాయి.

అటువంటిదే ‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమా కూడా. దానిలో జంటగా నటించి మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి మళ్ళీ మరోసారి ‘బ్యాండ్ మేళం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బ్యాండ్ మేళం బ్యాచ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. 

తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అందరినీ ఎంతగానో అలరించింది. ఇప్పుడు అటువంటి ప్రేమ కధతోనే బ్యాంగ్ మేళం  బ్యాచ్ వస్తోంది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష